భారతదేశం, నవంబర్ 14 -- రాజమౌళి స్టైలే వేరు. సినిమాలు అందరూ తీస్తారు. కానీ వాటిని ప్రమోట్ చేయడం ఎలాగో మాత్రం జక్కన్నను చూసే నేర్చుకోవాలేమో. మహేష్ బాబుతో తాను తీయబోయే నెక్ట్స్ మూవీ గ్లోబ్‌ట్రాటర్ బిగ్ రివీల్ ఈవెంట్ నే ఓ పెద్ద పండగలా చేయడానికి అతడు ప్లాన్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీని తాత్కాలికంగా గ్లోబ్‌ట్రాటర్ అని పిలుస్తున్న విషయం తెలుసు కదా. దీనికి అర్థం ప్రపంచాన్ని చుట్టేసే సంచారి అని. ఈ మూవీ నుంచి ఏదో పెద్ద విషయాన్నే రివీల్ చేస్తామంటూ శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికోసం ఏకంగా 100 అడుగుల ఎల్ఈడీ తెరను నిర్మించారు. ఈ ఈవెంట్ కోసం పాస్‌లు ఇవ్వడమే కాదు.. ఎలా రావాలి, ఏం చేయాలన్నది వివ...