భారతదేశం, నవంబర్ 17 -- దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'వారణాసి' చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను 'గ్లోబ్‌ట్రాటర్' అనే గ్రాండ్ ఈవెంట్‌లో ఆవిష్కరించిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట కు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ భారీ ఈవెంట్ గురించి 'బాహుబలి' చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

'వారణాసి గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్ ఇండియాలో జియోహాట్‌స్టార్, అంతర్జాతీయంగా 'వెరైటీ' (Variety) ద్వారా అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో, రాజమౌళి కేవలం ఆన్‌లైన్‌లో ఒక గ్లింప్స్‌ను విడుదల చేయకుండా, ఇంత పెద్ద ఈవెంట్‌ను ఎందుకు ఎంచుకున్నారని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే దీనిపై తాజాగా బాహుబలి మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సందేహాన...