భారతదేశం, నవంబర్ 2 -- ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం 'ఎస్ఎస్ఎంబీ 29' స్టార్ కాస్ట్‌పై సరదాగా ఒక అప్‌డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. దర్శకుడు తన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ మహేష్ బాబు శనివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్ లో వీళ్ల కామెంట్లతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కావడం వైరల్ గా మారింది.

ఎక్స్ లో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 లాంఛ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ లాంఛ్ ఈవెంట్ ను నవంబర్ 15న నిర్వహించనున్నారని ఓటీటీప్లే రిపోర్ట్ లో తెలిపింది. గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తారని చెప్పింది. ...