భారతదేశం, నవంబర్ 2 -- ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్‌గా మారిన సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ వరల్డ్ వైడ్‌గా హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు కారణం ముగ్గురు స్టార్స్ ఈ సినిమాతో కొలబారేట్ అవడం. వారే దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

ఎస్ఎస్ఎంబీ 29 కోసం

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటూ మొదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అప్డేట్ నవంబర్‌లో వస్తుందని రాజమౌళి ప్రకటించారు. నవంబర్ రానే వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో #noveMBerwillbehiSSt...