భారతదేశం, నవంబర్ 7 -- రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నా.. అతడు రిలీజ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ నుంచే కాపీ ఆరోపణలు మొదలవుతాయి. తాజాగా మహేష్ బాబుతో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ నుంచి అతడు రిలీజ్ చేసిన విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్ ను చాలా మంది ఫ్యాన్స్ గతంలో వచ్చిన రెండు సినిమాల్లోని లుక్స్ తో పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు.

గ్లోబ్‌ట్రాటర్ (#Globetrotter)గా పిలుస్తున్న రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి విలన్ రోల్ అయిన కుంభ లుక్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ కుంభ పాత్రలో నటిస్తున్నాడు. అతడు వీల్ చెయిర్ లో ఉన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఈ లుక్ చూడగానే ఫ్యాన్స్ చాలా మంది 24 మూవీలో సూర్య చేసిన ఆత్రేయ పాత్రతో పోల్చారు. ఆ సినిమాలోనూ సూర్య ఇలా వీల్ చెయిర్‌కే పరిమితమై అద్భుతమైన విలనీని పోషించాడు. అంతేకా...