భారతదేశం, నవంబర్ 18 -- వారణాసితో ప్రపంచ సినీ రంగంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేయాలనే కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా మూవీకి భారీ క్రేజ్ దక్కేలా చూడటం కోసం ఇప్పుడే ఇంటర్నేషనల్ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తోంది.

సాధారణంగా అయితే మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు. అదే లాంఛ్ ఈవెంట్ అయితే ఏదో క్లోజ్డ్ సర్క్యూట్ లో చేసేస్తారు. కానీ రాజమౌళి మాత్రం వారణాసి లాంఛ్ ఈవెంట్ నే భారీ స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ ను తనవైపునకు తిప్పుకుంది. ఈ లాంఛ్ ఈవెంట్ నుంచే మూవీ ప్రమోషన్లు స్ట...