భారతదేశం, నవంబర్ 16 -- చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా ఎంతోమంది ముద్దుగుమ్మలు వివిధ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అలానే తాజాగా మరొక చైల్డ్ ఆర్టిస్ట్ నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే, బాలీవుడ్‌లో మున్నిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బాల నటి నేరుగా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయడం విశేషంగా మారింది.

ఆ చిన్నదే హర్షాలి మల్హోత్రా. హర్షాలి అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టరు. కానీ, మున్ని అంటే బాలీవుడ్ ఆడియెన్స్ ఎక్కువగా గుర్తు పడతారు. మున్నీగా హర్షాలి ఆకట్టుకున్న సినిమానే భజరంగీ భాయిజాన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, బెబో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్.

బాక్సాఫీస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతోమంది ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ సినిమా. ...