భారతదేశం, జనవరి 3 -- భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పట్టాదారు పాస్ బుక్ ల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త పాస్ పుస్తకాల పంపిణీని ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. అధికారిక చిహ్నంతో మాత్రమే వీటిని అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని విమర్శించారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో... రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి పార్టీలు హామీనిచ్చాయని గుర్తు చేశారు.

"ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టాం. రీ సర్వే పూర్తైన గ్రా...