Hyderabad, జూన్ 30 -- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చివరిగా స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో అలరించాడు. అయితే, ఈ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో రామ్ పోతినేని.

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా తాజా కొత్త షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైంది.

రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ పోతినేని డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్‌గా పాత్రలో కనిపిస్తారు. అంటే సినిమాలో హీరో రామ్...