భారతదేశం, జనవరి 9 -- "రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పని చేస్తుంటే అదే రాజధాని. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదు. అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయ­కుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారు..? అమరావతి నిర్మాణం ఓ స్కామ్‌. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు" అంటూ తాజాగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలే ఏపీ రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరోసారి రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి హాట్ టాపిక్ మారిపోయింది.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం కొత్త రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న...