భారతదేశం, మే 2 -- విభజిత ఏపీకి రాజధాని నిర్మాణం కోసం భూముల్ని వదులుకున్న రైతులకు గత ఐదేళ్లుగా రోడ్లపై పోరాటాలు చేయాల్సి వచ్చింది. విభజన తర్వాత రాజధాని నగరం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలన్నది అప్పటి ప్రభుత్వం ఆలోచన.

ఈ ఆలోచన ప్రకారం గుంటూరు-కృష్ణా మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించలేదు. ఈ లోగా పక్కనే నది ఉండటం, అనువైన భూమి కావడంతో తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సుమారు 30 వేల ఎకరాలు అవసరం అవుతుందని పాలక పక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా సూచించారు. అయితే అన్ని వేల ఎకరాలు సేకరించాలంటే ప్రభుత్వంపై మోయలేనంత భారం పడుతుంది. అసలే రాష్ట్ర విభజన, వారసత్వంగా వచ్చిన అప్పులు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.

రాజధాని నిర్మాణం కోసం నాటి సీఎం చంద్రబాబు నాయుడ...