భారతదేశం, జూలై 22 -- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 1,033 నివాస ప్లాట్లు కాగా 723 వాణిజ్య ప్లాట్లు. మొత్తంగా 746 మంది రైతులు, భూయజమానులకు ఈ- లాటరీ విధానంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ప్లాట్లను కేటాయించారు.

ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సీఆర్‌డీఏ అధికారులు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఆర్డీఏ ల్యాండ్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.డేవిడ్ రాజు మాట్లాడుతూ.. ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగ...