భారతదేశం, డిసెంబర్ 3 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రెండో దశ భూ సమీకరణను ఆమోదించింది. మంగళవారం పరిపాలనా అనుమతులు, ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టడానికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి అధికారం ఇచ్చారు.

ఈ ఉత్తర్వు ప్రకారం, సీఆర్డీఏ ఏడు గ్రామాలలో 16,666.57 ఎకరాల పట్టా (ప్రైవేట్), అసైన్డ్ భూములను సమీకరిస్తుంది. రెండో దశ భూ సమీకరణ పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలను కవర్ చేస్తుంది. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో నాలుగు గ్రామాలను గుర్తించారు...