భారతదేశం, మే 14 -- ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీ20లకూ గుడ్ బై చెప్పిన రోహిత్ ఇప్పుడు కేవలం వన్డేల్లోనే ఆడతాడు. అందుకే రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నాడేమోననే కామెంట్లు వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను రోహిత్ కలవడం హాట్ టాపిక్ గా మారింది.

టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ మంగళవారం (మే 13) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను వారి అధికారిక నివాసం వర్షాలో కలిశాడు. ఈ మీటింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

"భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం వర్షాలో కలిసి, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్ నుంచి అతని రిటైర్మెంట్, రోహిత్ ప్రయాణంలో తదుపరి అధ్యాయంలో నిరంతర విజయం కోసం న...