భారతదేశం, డిసెంబర్ 22 -- రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చేశాయి. సోమవారం విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 26,852 కేసులు నమోదయ్యాయని, వాటిలో 21,056 కేసులు పరిష్కరించినట్టుగా తెలిపారు. 78 శాతం పరిష్కార రేటును సాధించామని అన్నారు.

2025లో సుమారు 516 పోక్సో, 809 లైంగిక వేధింపులు, 479 కిడ్నాప్, 12 వరకట్న హత్య కేసులు నమోదు అయ్యాయి. 2025లో దాదాపు 6,188 ముందస్తు అరెస్టులు, 3734 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. విజిబుల్ పోలీసింగ్, త్వరిత స్పందన, అనుమానిత షీట్ల ద్వారా పర్యవేక్షణ, నేరస్థులను అరెస్టు చేయడం వల్ల ఆస్తి నేరాలు 15 శాతం తగ్గాయి. 12 కేసుల్లో దోషులకు ...