భారతదేశం, ఏప్రిల్ 18 -- ఏపీలో శుక్రవారం అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుంది. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా...