భారతదేశం, ఆగస్టు 8 -- సోదరుడు, సోదరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పే పండుగ రాఖీ. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి, ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పకనే చెప్తారు. కొంతమంది సోదరులు, సోదరీమణులు ఏదో ఒక కారణం చేత ఒకరికొకరు దూరంగా ఉండవచ్చు. దీని కారణంగా వారు మొబైల్ ఫోన్ల ద్వారా కనెక్ట్ అయి ఉంటారు. రక్షా బంధన్ అనేది సోదరులు మరియు సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నం. ఈ రాఖీ ప్రత్యేక సందర్భంగా ఈ శుభాకాంక్షలతో మీ సోదరుడు, సోదరిని సంతోషపెట్టండి.

సోదరుడు అంటే జీవితానికి రక్షణ, మార్గదర్శక కాంతి. నా ప్రియమైన సోదరుడికి రక్షా బంధన్ శుభాకాంక్షలు.

నువ్వే నా చిరునవ్వు, నువ్వే నా ఆనందం, నా జీవితమంతా నువ్వు ఉండాలి. నా ప్రియమైన సోదరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

కలిసి పుట్టిన వారు మాత్రమే అన్నాచెల్లెల్లు కాదు.. ఆప్యాయంగా అన్నా, చెల్లి...