భారతదేశం, మే 15 -- టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఘటనపై కేసు నమోదైంది. రాంగ్ రూట్ వెళ్లడమే కాకుండా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు.

ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో...జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వచ్చి హల్ చల్ చేశారు. ఈ ఘటన ఎదురుగా ఉన్న మరో కారు డాష్ క్యామ్ లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈనెల 13న రోడ్‌ నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసానికి వెళ్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. జర్నలిస్ట్‌ కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్‌ రూట్‌లో తన ఇంటికి వెళ్లేందుకు హీరో ప్రయత్నించారు...