భారతదేశం, అక్టోబర్ 9 -- హైదరాబాద్ నగరంలో రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 1, 7 మధ్యకాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10,652 మంది వాహనదారులపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేశారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒక ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

చాలా మంది వాహనదారులు యూ-టర్న్ దగ్గరకు వెళ్లకుండా.. కాస్త టైమ్ కలిసి వస్తుందని రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారు. అయితే వాహనాలు ప్రయాణించే రూట్‌లో వ్యతిరేకంగ వెళితే ఇతరులకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు.. ప్రమాదాలు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. 'ఇటువంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడాన్ని ఉపేక్షించేది లేదు. నియమాలు అందరికీ ఉంటాయి, ఉల్లంఘించినవారు కఠినమైన చర్యలను ఎదుర్కొంటారు.' అని ఒక సీనియర్ అ...