Hyderabad, అక్టోబర్ 4 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియా సైట్లలో వార్తలు జోరుగా వస్తున్నాయి. శుక్రవారం అంటే అక్టోబర్ 4న చాలా రహస్యంగా విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగనట్లు పలు బాలీవుడ్ సైట్స్ సైతం పేర్కొన్నాయి.

హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలోనే ఉదయం 11 గంటలకు రష్మిక మందన్నాతో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా నిరాడంబరంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ జరిగిందని నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని హీరో హీరోయిన్ల సన్నిహితులు స్వయంగా ప్రకటించినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మిక పెళ్లికి ముహుర్తాలు కుదిరినట్లు తెలుస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ, రష్మిక మం...