భారతదేశం, జూలై 26 -- ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. 11 సిక్సర్లతో వెస్టిండీస్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 37 బంతుల్లోనే శతకంతో హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ గా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ తో శనివారం (జులై 25) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. విండీస్ బ్యాటర్ రసెల్ బ్యాట్ తోనే అదే టీమ్ పై టిమ్ డేవిడ్ చెలరేగడం విశేషం.

మిడిల్ఆర్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ శనివారం T20Iలలో ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 37 బంతుల్లో 102 పరుగులు చేసి, వార్నర్ పార్క్ స్టేడియాన్ని ఊపేశాడు. దీంతో సెయింట్ కిట్స్‌లో 6 వికెట్...