భారతదేశం, ఆగస్టు 24 -- రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇటీవల సుంకాల విషయంలో భారత్ పై చర్యలు తీసుకుంది. రష్యా నుంచి భారత్ నిరంతరం చమురును కొనుగోలు చేస్తోందని, ఈ కారణంగా ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడితో కూడా భేటీ అయ్యారు ట్రంప్.

ఇన్ని ఆరోపణల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. అదే సమయంలో భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్ చుక్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ భారత పర్యటన గురించి మాట్లాడారు. అంతేకాకుండా రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడంలో భారతదేశం మరింత చురుకైన పాత్ర పోషించాలని ఉక్రెయిన్ మరోసారి విజ్ఞప్తి చేసింది.

భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలిష్ చు...