Hyderabad, ఆగస్టు 18 -- రష్మిక మందన్నా ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదో హారర్ కామెడీ మూవీ కావడం విశేషం. మ్యాడక్ హారర్-కామెడీ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమా పేరు 'థామా' (Thama). దీనికి ఆదిత్య సర్పొదార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించగా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా కీలక పాత్రలు పోషించారు. సోమవారం (ఆగస్టు 18) సాయంత్రం వారి పాత్రల ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి.

హారర్ కామెడీ సినిమాలు స్త్రీ, ముంజ్యాలాంటివి సక్సెస్ కావడంతో అదే కోవలో వస్తున్న మరో మూవీ థామా. ఇందులో రష్మిక మందన్నా నటిస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా.. అందరూ వెతుకుతున్న రక్షకుడు అలోక్ పాత్రలో నటించాడు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడ...