భారతదేశం, జూన్ 27 -- ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. ఈ బ్యూటీ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతోంది. వరుసగా సూపర్ డూపర్ హిట్లు అందిస్తోంది. అయితే ఇప్పటివరకూ మూవీస్ లో రష్మిక ఒకెత్తు అయితే.. రాబోయే కొత్త సినిమాలో మాత్రం ఆమె అవతారం మరో రేంజ్ లో ఉండబోతోంది. రష్మిక కొత్త సినిమా పేరును సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు న్యూ లుక్ షేర్ చేసింది.

రష్మిక మందన్న తను చేయబోయే మరో కొత్త సినిమా పేరు అనౌన్స్ చేసింది. ఈ మూవీ నేమ్ ఏదో గెస్ చేసి, తనను కలిసే ఛాన్స్ పట్టేయండి అని సోషల్ మీడియాలో రష్మిక పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం (జూన్ 27) ఆమెనే సోషల్ మీడియాలో సినిమా పేరు పోస్టు చేసింది. ఆ పేరు 'మైసా'. అవును రష్మిక కొత్త సినిమా పేరు మైసా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ప్రకారం మైసా అంటే అమ్మ అని అర్థం. ఓ వారియర్ మదర్ అని చ...