భారతదేశం, అక్టోబర్ 4 -- తెలుగు సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో నటి రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్లు వివాహం చేసుకోనున్నారు. 36 ఏళ్ల విజయ్ బృందం శనివారం (అక్టోబర్ 4) హిందుస్థాన్ టైమ్స్‌కి ఈ విషయాన్ని ధృవీకరించింది. 1996 ఏప్రిల్ 5న జన్మించిన 29 ఏళ్ల రష్మిక మందన్న దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 47.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న రష్మిక మందన్న యాక్టింగ్ తో పాటు వివిధ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, మోడలింగ్ అసైన్‌మెంట్‌లు, బ్రాండ్ అంబాసిడర్ పాత్రల ద్వారా రూ.కోట్లు సంపాదిస్తోంది. ఫోర్బ్స్ ప్రకారం రష్మిక నెట్ వర్త్ దాదాపు రూ. 66 కోట్లు. ఇది ఆమెకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ నెట్ వర్త రూ.39 కోట్ల కంటే ఎక్కవ.

మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి నటనలో తనదైన ముద్ర వేసింది ర...