Hyderabad, సెప్టెంబర్ 26 -- బాలీవుడ్ లో రష్మిక మందన్నా నటిస్తున్న మరో హారర్ కామెడీ మూవీ థామా (Thamma). మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ల ఈ హారర్ కామెడీ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మేకర్స్ చివరికి ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీల సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

గతంలో స్త్రీ, ముంజ్యా, బేడియాలాంటి హారర్ కామెడీ సినిమాలను అందించిన మ్యాడాక్ ఫిల్మ్స్ ఇప్పుడీ థామా (Thamma)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 26) 'థామా' మేకర్స్ ఆయుష్మాన్, రష్మిక, నవాజుద్దీన్‌లు నటించిన ఒక ఆసక్తికరమైన, హాస్యభరితమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇది నవాజుద్దీన్‌తో ఒక వాయిస్ మాట్లాడుతూ.. "నువ్వు బేతాల్ లాంటి వాడివి. భూమిని మనుష...