Hyderabad, అక్టోబర్ 11 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల ఎంగేజ్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటు సౌత్, అటు బాలీవుడ్‌లో వీరిద్ది నిశ్చితార్థంపై అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎంగేజ్‌మెంట్ విషయంపై విజయ దేవరకొండ, రష్మిక అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే, తాజాగా రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్మిక మందన్నా తన పెట్ (పెంపుడు కుక్క) ఆరాతో ఆడుకుంటూ కనిపించింది. అయితే, ఈ క్రమంలోనే రష్మిక మందన్నా చేతి వేలికి ఓ డైమండ్ రింగ్ తళుక్కుమంటూ మెరిసింది.

పెంపుడు కుక్కను రష్మిక మందన్నా ముద్దు చేస్తున్న సమయంలో చాలా సార్లు ఆ డైమండ్ రింగ్ కనిపించింది. ఆ డైమండ్ రింగ్ నిశ్చితార్థపు ఉంగరమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఎంగే...