భారతదేశం, నవంబర్ 19 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన విషయం తెలుసు కదా. ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఓటీటీ డీల్ ద్వారా నిర్మాతలు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.

రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది. వుమన్ సెంట్రిక్ మూవీకి ఇది మంచి మొత్తమనే చెప్పాలి. ఇక తాజా సమాచారం ప్రకారం 'ది గర్ల్‌ఫ్రెండ్' డిసెంబర్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ విడుదల తేదీ దాదాపు ఖరారైనట్లే.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గత రెండు సంవత్సరాల...