భారతదేశం, డిసెంబర్ 29 -- టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌లోనే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్.. 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాళ్ల సన్నిహిత వర్గాలే తెలిపాయి.

గీత గోవిందం జంట త్వరలో రియల్ లైఫ్ జంటగా మారబోతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి బయట ఎక్కడా చెప్పకపోయినా.. పెళ్లి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ కు ఈ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.

విజయ్, రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న పెళ్లితో ఒక్కటవనున్నారు. వీళ్లు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లోని ఓ హిస్టారిక్ ప్యాలెస్ ను ఇప్పటికే బుక్ చేసినట్లు తెలుస్తోంది.

రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ ఎవరికీ త...