భారతదేశం, సెప్టెంబర్ 6 -- ఇన్ని రోజులు సీక్రెట్ గా డేటింగ్ లో ఉంటూ, అప్పుడప్పుడూ బయట కనిపించి రూమర్లకు బలం చేకూర్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ బయటపడ్డట్లే కనిపిస్తోంది. విజయ్ తో రష్మికకు ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. సైమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్లిన రష్మిక చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ లాంటిది ఉండటమే ఇందుకు కారణం.

సైమా అవార్డుల ఈవెంట్ కోసం రష్మిక మందన్న దుబాయ్ వెళ్లింది. ముంబై నుండి దుబాయ్ చేరుకున్నప్పుడు ఆమె మూడో వేలికి ఉంగరం కనిపించింది. దీంతో ఆమె నిశ్చితార్థం చేసుకుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆమె, ఆమె ప్రియుడు విజయ్ దేవరకొండ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని రెడ్డిట్ లో కూడా చర్చ జరుగుతోంది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వార్తలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. దుబాయ్ చేరుకున్న తర్వాత పాపరాజీలు రష్...