Hyderabad, జూన్ 10 -- ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పాన్ ఇండియా సూపర్‌స్టార్ ఎవరు? 'బాహుబలి', 'కల్కి 2898 ఏడీ' తర్వాత ప్రభాసా లేక 'పుష్ప'తో అల్లు అర్జునా లేక 'కేజీఎఫ్'తో యష్.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రకారం వీళ్లెవరూ కాదు. ఎందుకంటే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో విజయవంతమైన సినిమాలతో తన తరంలోనే అతిపెద్ద పాన్ ఇండియా స్టార్‌ రష్మిక అన్నది నాగార్జున్ అభిప్రాయం.

నాగార్జున మాటల ప్రకారం ఆ రియల్ పాన్ ఇండియా నటి రష్మిక మందన్నే. ఆమెతో కలిసి నాగ్.. 'కుబేర'లో స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నాడు. గత మూడు సంవత్సరాలలో రష్మిక.. 'యానిమల్', 'పుష్ప 2: ది రూల్', 'ఛావా', 'సికందర్' వంటి చిత్రాలలో నటించింది. వీటిలో 'సికందర్' మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.

'సికందర్' ప్రపంచవ్యాప్తంగా రూ.187 కోట్ల గ్రాస్ వసూళ్లతో తన థియే...