భారతదేశం, అక్టోబర్ 4 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ల వివాహం జరగనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ జంట రహస్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుందని సమాచారం. ఫిబ్రవరి 2026లో పెళ్లి జరగవచ్చు. అయితే ఈ జంట తమ సంబంధం గురించి లేదా నిశ్చితార్థం గురించి అధికారికంగా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు అని ఎమ్9 న్యూస్ తెలిపింది.

36 ఏళ్ల విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మందన్నతో పెళ్లి వార్తల నేపథ్యంలో వీళ్ల పేర్లు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. జీక్యూ ఇండియా ప్రకారం 2024 ప్రారంభంలో విజయ్ దేవరకొండ నెట్ వర్త్ సుమారు రూ. 39 కోట్లుగా అంచనా వేశారు. ఇది సుమారు $4 మిలియన్లు. ఈ లైగర్ నటుడి సంపదకు కారణం అతని సినిమాలు, అతని ఫ్యాషన్ ...