భారతదేశం, నవంబర్ 1 -- రవితేజకు దిమ్మతిరిగే షాక్. మాస్ మహారాజ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కిన 'మాస్ జాతర' బాక్సాఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు షాకింగ్ గా ఉన్నాయి. అసలు ఎవరూ ఊహించని వసూళ్లుతో దారుణంగా మొదలైంది మాస్ జాతర మూవీ.

భాను బోగవరపు దర్శకత్వంలో రవితేజ నటించిన మూవీ మాస్ జాతర. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ 75వ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా దారుణమైన ఆరంభాన్ని పొందింది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ డే ఇండియాలో కనీసం కోటి కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం తొలి రోజు ఇండియాలో రూ.0.08 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే కేవలం రూ.80 వేలు మాత్రమే...