Hyderabad, ఆగస్టు 11 -- ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మరో సినిమా మాస్ జాతర. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ జాతర టీజర్ ఇవాళ (ఆగస్ట్ 11) రిలీజ్ అయింది. టీజర్ అంతా కామెడీ, యాక్షన్‌తో నిండిపోయింది. మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ మెప్పించాడు. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. నాకంటూ ఓ చరిత్ర ఉంది అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

శ్రీలీతో రవితేజ కామెడీ, కెమిస్ట్రీ బాగుంది. శ్రీలీల దగ్గరికి వచ్చి చేసేద్దామా అని రవితేజ అంటే.. ఏటీ.. అని శ్రీలీల అనడం రొమాంటిక్‌గా ఉంది. ఇక చివరిల...