భారతదేశం, ఆగస్టు 31 -- భారతదేశంలో ఆటోమెుబైల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇక కార్ల అమ్మకాల్లోనూ ఇండియా దూసుకెళ్తోంది. వివిధ ఆటోమొబైల్ తయారీదారులు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక కారును విడుదల అవుతూనే ఉంది. దసరా, దీపావళి నేపథ్యంలో సెప్టెంబర్ చాలా ముఖ్యమైన నెలగా చూస్తారు. అందుకే కొన్ని కంపెనీలు కార్లను తీసుకొస్తున్నాయి.

ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది సెప్టెంబర్ 3న విడుదల కానుంది. దీని ధర రూ. 17 లక్షల నుండి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ఆగస్టు 26న గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లోని మారుతి సుజుకి తయారీ కర్మాగారం నుండి మొదటి 'ఇ-విటారా'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కారు చక్కని డిజైన్‌ను కలిగి ఉంది. ఇది అనేక రంగుల్లో లభిస్తుంది. 49 కిలోవాట్ (kWh), 61 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

ఈ ...