భారతదేశం, జనవరి 13 -- బాస్ ఈజ్ బ్యాక్.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అంటున్న మాట ఇది. అవును.. కలెక్షన్ల రికార్డుల్లోనూ బాస్ ఈజ్ బ్యాక్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు రికార్డు ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ప్రీమియర్లు, ఫస్ట్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా మన శంకర వరప్రసాద్ గారు అదిరే వసూళ్లు రాబట్టింది. చిరు కెరీర్ లోనే ఇది సెకండ్ హైయ్యస్ట్.

చిరంజీవి హీరోగా సంక్రాంతి 2026కు రిలీజైన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

''మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలు కొట్టేశారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీమియర...