Andhrapradesh, సెప్టెంబర్ 4 -- విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం రద్దు అయింది. విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ప్రాథమిక వివరాల ప్రకారం. టేకాఫ్ కోసం రన్ వేపై వెళ్తుండగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పక్షి (డేగ) తగిలింది. దీంతో విమాన రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గమనించిన సిబ్బంది. విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది.

'టేకాఫ్ అయ్యే ముందు పక్షి దాడి జరిగింది. విమానం రన్ వేపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమయ్యాం. సర్వీస్ ను రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం" అని ఓ అధికారి అధికారి పీటీఐకి తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Tel...