భారతదేశం, జూలై 2 -- కొన్నిసార్లు రద్దీగా ఉండే సమయంలోనూ ఓలా, ఉబర్‌వంటి సంస్థల క్యాబ్ రేట్లు తక్కువగానే ఉండటం చూసి ఉంటాం. మరికొన్ని సార్లు ఎక్కువగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి సమయం గురించి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రద్దీగా ఉండే సమయంలో రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. మోటర్ వెహికల్ అగ్రిగ్రేటర్ గైడ్‌లైన్స్‌ను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మోటార్ వెహికల్స్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు ఇప్పుడు బేస్ ఫేర్‌లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకునే అవకాశం కల్పించింది. రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునే అవకాశం ఉంది. అంతుముందు ఇది 150 శాతం. అయితే మూడు కిలో మీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛ...