భారతదేశం, జనవరి 24 -- రథసప్తమి నాడు సూర్యుని అనుగ్రహం కలగాలని చాలామంది వివిధ రకాల పరిహారాలను పాటిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. దీనిని సూర్య సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రథసప్తమికి మీరు కూడా సూర్యుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే మీరు మీ రాశి ప్రకారం వీటిని దానం చేయడం మంచిది.

జనవరి 25, ఆదివారం అనగా ఈరోజు రథసప్తమి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించాలి. దాంతో బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అలాగే రథసప్తమి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను కచ్చితంగా దానం చేసేలా చూసుకోవాలి. మరి ఏ రాశి వారు వేటిని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి వారు రథసప్తమి నాడు బెల్లం, వస్త్రాలను దానం చేయడం...