Hyderabad, జూన్ 29 -- పూరీలో జరుగుతున్న రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. జూన్ 27, ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి ఇక్కడ రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో పూరి జగన్నాథుడితో పాటు సుభద్రా దేవి, బలరాముడిని కూడా రథాలపై ఊరేగిస్తారు.

రథాలను తీసుకు వెళ్తున్నప్పుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. రథాలను లాగితే జనన మరణ చక్రాల నుండి విముక్తి లభిస్తుంది. చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రథయాత్రలో పాల్గొనడానికి మీకు వీలు లేకపోతే, రథయాత్ర చూడడానికి వెళ్లలేని వారు ఇంట్లోనే ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వలన పూరి జగన్నాథుని అనుగ్రహం కలుగుతుంది, సంతోషంగా ఉండవచ్చు.

పూరి జగన్నాథుని ఇంట్లో ఈ విధంగా ఆరాధించండి. రథయాత్రకు వెళ్లలేని వారు ఇంట్లో ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వలన జగన్నాధుని ప్రత్యేక అశీసులు పొంద...