భారతదేశం, డిసెంబర్ 12 -- సూపర్ స్టార్ రజినీకాంత్. స్టైల్ కు, స్వాగ్ కు, స్క్రీన్ పై యాక్టింగ్ కు ఆయన మారుపేరు. ఆయన్ని తెరపై చూసి నటన మీద ఇష్టం పెంచుకున్నవాళ్లు ఎంతో మంది. ఆయన పక్కన నిలబడాలని ప్రయత్నించే సెలబ్రిటీలు ఎందరో. అలాంటి తలైవా ఇవాళ (డిసెంబర్ 12) 75వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన 50 ఏళ్ల సినీ కెరీర్ లోని 5 ఉత్తమ సినిమాల ఓటీటీలపై ఓ లుక్కేయండి. ఇవన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

రజినీకాంత్ కెరీర్ లో ఓ టర్నింగ్ పాయింట్ బాషా మూవీ. అప్పట్లో అదో సంచలనం. అందులో రెండు యాంగిల్స్ ఉన్న పాత్రల్లో తలైవా అదరగొట్టారు. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని డైలాగ్ ఎవర్ గ్రీన్. ఈ సినిమా జనవరి 15, 1995లో రిలీజైంది. మాణిక్యం (గతంలో మాణిక్ బాషా) క్యారెక్టర్ లో సూపర్ స్టార్ యాక్టింగ్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్ప...