భారతదేశం, జూన్ 16 -- టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. శివుడి పరమ భక్తుడు కన్నప్పగా ఈ చిత్రంలో విష్ణు నటించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ కన్నప్ప చిత్రాన్ని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‍కు మంచు విష్ణు ప్రత్యేకంగా చూపించారు.

గత రాత్రి రజినీకాంత్ తమ కన్నప్ప చిత్రం చూసి తనను గట్టిగా హత్తుకున్నారని, ఆయన నుంచి ఆ హగ్ కోసం తాను 22ఏళ్లుగా ఎదురుచూశానని మంచు విష్ణు నేడు (జూన్ 16) ట్వీట్ చేశారు. రజినీని తాను, తన తండ్రి మోహన్ బాబు కలిసిన ఫొటోలను పోస్ట్ చేశారు.

కన్నప్ప చిత్రం రజినీకాంత్‍కు చాలా నచ్చిందని విష్ణు రాసుకొచ్చారు. "గత రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప చిత్రం ...