Hyderabad, ఆగస్టు 1 -- సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున నటించిన మూవీ కూలీ (Coolie). ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ మూవీ టీమ్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు పెద్ద షాకే ఇచ్చింది.

రజనీకాంత్ నటించిన కూలీ మూవీకి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఇది రజనీ అభిమానులను షాక్ కు గురి చేసింది. సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎ సర్టిఫికెట్ పొందిన తొలి మూవీ కూడా ఇదే.

దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో ఉన్న మితిమీరిన వయోలెన్స్ వల్ల ఇలా చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది మూవీ చూస్తేనే తెలుస్తుంది. తమ మూవీకి ఎ సర్ట...