భారతదేశం, నవంబర్ 20 -- 50 ఏళ్లు, అర్ధ శతాబ్దం.. శివాజీ రావు గైక్వాడ్ అనే యువకుడు రజనీకాంత్ గా మారి భారతీయ సినిమాను శాశ్వతంగా మార్చేసినప్పటి నుంచి ఇన్నేళ్లు గడిచాయి. ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకోవడానికి, సంబరంలా మార్చడానికి 'హిందుస్థాన్ టైమ్స్', 'OTTప్లే' కలిసి ఎన్నడూ జరగనిది చేయడానికి సిద్ధమయ్యాయి. 'హిందుస్థాన్ టైమ్స్' తన 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే వ్యక్తికి అంకితం చేస్తూ తన మొదటి పేజీని కేటాయించింది.

వార్తాపత్రిక పాఠకులు 'హిందుస్థాన్ టైమ్స్' అనే పరిచయమైన పేరుతో కాకుండా, 'రజనీకాంత్ టైమ్స్' తో మేల్కొన్నారు. ఇది సినిమా రంగంలో సూపర్ స్టార్ స్వర్ణోత్సవానికి అద్భుతమైన మొదటి పేజీ ట్రిబ్యూట్. ఒక ఉద్యమంగా మారిన వ్యక్తి.. రజనీకాంత్ కథ ఎప్పుడూ అండర్ డాగ్ కథే. బెంగళూరు నుండి వచ్చిన ఒక బాలుడు, ఒకప్పుడు బస్ కండక్టర్ గా పనిచేసినవాడు, భారతీయ సినిమాకు ...