భారతదేశం, జూలై 15 -- రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ 'కూలీ'పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ కు మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. అయినా ఇప్పటికీ మూవీ నుంచి ట్రైలర్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ ఎప్పుడూ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. కూలీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.

కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. కూలీ ఫిల్మ్ ట్రైలర్ ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. ''మేం ఒక్క ట్రైలర్ ను మాత్రమే రిలీజ్ చేస్తాం. అది ఆగస్టు 2. నేను ఎక్కవ డేట్లు చెప్పాలనుకోవడం లేదు'' అని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ...