Hyderabad, జూన్ 25 -- సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మూవీ కూలీ. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బుధవారం (జూన్ 25) సాయంత్రం 6 గంటలకు రిలీజైంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చికిటు చికిటు అంటూ మాస్ బీట్స్ తో సాగిన ఈ పాటలో సూపర్ స్టార్ వేసిన స్టెప్స్ హైలైట్ అని చెప్పొచ్చు.

రజనీకాంత్ లీడ్ రోల్లో నటిస్తున్న కూలీ మూవీ ఆగస్ట్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక తాజాగా వచ్చిన చికిటు చికిటు సాంగ్ గురించి చెప్పాలంటే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, టి. రాజేందర్ బీట్ బాక్సింగ్, అరివు రాసిన లిరిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. 'చికిటు' సాంగ్ ప్రోమో జూన్ 24న విడుదలై, రజనీకాంత్ స్టైలిష్ అవతార్‌తో అభిమానులను ఆకర్షించింది.

"బ్రో.. వాట్ దా.. చాలు బ్రో, ఓ హాట్ కప్ టీ తర్వ...