భారతదేశం, జూలై 23 -- ఆగస్టులో క్రేజీ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో మెయిన్ గా రెండు మూవీస్ పై భారీ అంచనాలున్నాయి. అవే.. రజనీకాంత్ 'కూలీ' (Coolie), హృతిక్ రోష‌న్‌, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ 'వార్ 2' (War 2). ఈ రెండు సినిమాలు ఒకే తేదీన రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 14న థియేటర్లలో ఢీ కొట్టబోతున్నాయి.

రజనీకాంత్ కూలీ, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. దీనికి ఇంకా 20 రోజులే ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లు ఓ రేంజ్ లో ఉండాలి. కూలీ సినిమా ప్రమోషన్లలో అదరగొడుతోంది. కానీ వార్ 2 మూవీ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. దీంతో వార్ 2 సినిమా రిలీజ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్ 2 సినిమా రేసు నుంచి తప్పుకుంటుందేమోననే డౌట్లు వినిపిస్తున్నాయి.

లోకేశ్ కనగరాజ్ డైర...