భారతదేశం, డిసెంబర్ 25 -- సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'జైలర్ 2' గురించి ఒక సెన్సేషనల్ వార్త బయటకొచ్చింది. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించే ఛాన్స్ ఉందంటూ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి హింట్ ఇచ్చాడు. అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ వార్తతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

తలైవా రజనీకాంత్ మళ్లీ 'టైగర్ ముత్తువేల్ పాండ్యన్'గా బాక్సాఫీస్ వేట మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలున్న 'జైలర్ 2'లో షారుక్ ఖాన్ కూడా ఉంటాడన్న వార్త ఇప్పుడు ఆ అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. దీనికి కారణమైన వార్త ఏంటో ఇక్కడ చూడండి.

ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ నటుడు మిథున్ చక్రవర్తి మెయిన్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా అతని మాటల మధ్యలో షారుక్ ఖాన్ గురించి ఒక చిన్న హింట్ వదిలాడట.

మేకర్స్ ఇంకా కన్ఫర...