భారతదేశం, నవంబర్ 15 -- ఈ నెల ప్రారంభంలో కమల్ హాసన్, రజినీకాంంత్ కలిసి 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఒక సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 2027 పొంగల్ నాటికి విడుదల కానుంది. సుందర్ సి దీనికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే సుందర్ సి.. ఊహించని, తప్పించుకోలేని పరిస్థితుల కారణంగా సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే శనివారం (నవంబర్ 15) ఈ మూవీ నుంచి సుందర్ సి తప్పుకోవడంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విలేకరులతో విమానాశ్రయం వెలుపల మాట్లాడుతూ.. "సుందర్ సి తన ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రాజెక్ట్ నుండి వైదొలగడానికి గల కారణాన్ని వివరించారు. ఒక ఇన్వెస్టర్ గా నా స్టార్‌కు నచ్చే స్క్రిప్ట్ ఈ సినిమాకు కావాలి. అదే సరైన మార్గం. ఆయనకు నచ్చే వరకు మేము సరైన కథల కోసం వెతుకుతూన...