భారతదేశం, నవంబర్ 13 -- దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి కలిసి పనిచేయబోతున్నారనే ప్రకటనతో అభిమానులు ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి నిరాశపరిచే వార్త వెలువడింది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'తలైవా 173' చిత్రం నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నాడు.

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతలోనే అతడు తప్పుకున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సుందర్ సి పేరుగాంచాడు. దీంతో అతడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రకటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో అతడు రజనీకాంత్‌తో కలిసి 'అరుణాచలం' వంటి హిట్ చిత్రాన్ని కూడా అందించాడు...